తిరుపతి ఐఎంఎ శాఖకు రాష్ట్రస్థాయి అవార్డులుప్రజాశక్తి- తిరుపతి సిటీ : విజయవాడలో ఈనెల 25,26 తేదీలలో జరిగిన ఐఎంఏ రాష్ట్ర మహాసభలో తిరుపతి ఐఎంఏ శాఖకు అవార్డుల పంట రావడం జరిగింది. ఈఏడాది 5 అవార్డులను తిరుపతి శాఖకు ప్రదానం చేశారు. ఈ అవార్డులను ఐఎంఎ జాతీయ అధ్యక్షులు ఐఎంఏ డాక్టర్ శరత్‌కుమార్ అగర్వాల్, జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ దగ్గుమాటి శ్రీహరి రావు, జాతీయ సెక్రటరీ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్ జే నాయక్, జాతీయ కోశాధికారి డాక్టర్ శిట్టిబాలీ అవార్డులను ప్రధానం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికష్ణ, సెక్రెటరీ డాక్టర్ ఫణిధర అవార్డులను ఎంపిక చేశారు. తిరుపతిశాఖకు ఇంటర్నేషనల్ వేస్ట్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం చేసినందుకుగాను ఒక అవార్డు, డాక్టర్స్ డేను రాష్ట్రస్థాయిలో సదస్సుగా నిర్వహించినందుకు గాను మరో అవార్డు, ఆవోగాన్ చలే ప్రోగ్రామ్ క్రింద గ్రామాలను దత్తత తీసుకున్నందుకుగాను ఇంకో అవార్డును అందజేశారు. వ్యక్తిగత స్థాయిలో డాక్టర్ దగ్గుమాటి శ్రీహరి రావుకి జాతీయ, రాష్ట్ర ఐఎంఎకు మధ్య సమన్వయంగా ఉండి కార్యక్రమాలు నిర్వహించినందుకుగాను ప్రత్యేక అభినందన అవార్డును ప్రదానం చేశారు. డాక్టర్ రాయపు రమేష్‌కి తను చేసినటువంటి సీజీపీ (కాలేజ్ అఫ్ జనరల్ ప్రాక్టీషనర్)లో ప్రతినెలా ఇంటర్నేషనల్ స్థాయిలో వర్చువల్ మీటింగ్ జరిపినందుకుగాను అవార్డు ప్రదానం చేశారు. గత ఐదు సంవత్సరాలలో ఈసారి ఎక్కువ అవార్డులను డాక్టర్ హరికష్ణ, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ నాగేశ్వరెడ్డి, అధ్యక్షులు కార్యదర్శి ట్రెజరర్‌గా ఉన్న సందర్భంలో రావడం సంతోషమని, హదయపూర్వకంగా అభినందిస్తున్నామని ఐఎంఐ జాతీయ రాష్ట్ర నాయకులు తెలిపారు.