దుస్థితిలో ఆలత్తూరు రోడ్డు

దుస్థితిలో ఆలత్తూరు రోడ్డుగుంతలలో పేపరు పడవలతో నిరసనప్రజాశక్తి -బుచ్చినాయుడు కండ్రిగ: గుంతలమయమైన ఆలత్తూరు రోడ్డు దుస్థితిని పట్టించుకోవాలని కోరుతూ టిడిపి, జనసేన నాయకులు పేపరు పడవలతో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని ఆలత్తూరు రోడ్డు మార్గంలో ఆలత్తూరు, పిల్లేటి వారి కండ్రిగ , పుతేరి మూడు గ్రామ పంచాయ తీలలోని 15 గ్రామాలకు ఈ రహదారి ఉపయోగ కరంగా వుంటుందని, ప్రతి అడుగుకు గుంతల మయ మైందని, ఈ గుంతలు రెండు నుంచి మూడు అడుగుల లోతులో వుండడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. ఈ మార్గంలో వస్తున్న ఆలత్తూరు బస్సును రహదారి అధ్వానంగా ఉన్న కారణంగా అప్పుడప్పుడూ నిలిపివేస్తు న్నారన్నారు. ప్రతిరోజూ 40 నుంచి 60 టన్నుల మెటల్‌ టిప్పర్లు సుమారు 100 టిప్పర్లు ఈ రహదారిపై తిరు గుతున్నాయని, వాటి ద్వారా మెటల్‌ రాయల్టీ వసూలు చేస్తున్న ప్రభుత్వం కనీసం రహదారికి మరమ్మతులు కూడా చేయకుండా వదిలేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు మెయింటెనెన్స్‌ నిధులు కూడా విడుదల చేయించలేని అసమర్థత కారణంగా అధ్వాన స్థితికి ఈ రహదారి అద్దం పడుతోందని, అధిక లోడుతో వెళుతున్న టిప్పర్ల వద్ద అధికారులు మామూళ్ల వసూళ్లు చేసుకుంటూ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. నిరసనగా బుచ్చినాయుడు కండ్రిగ మండల టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఈ రహదారి గుంతలలో పేపర్‌ పడవలతో నిరసన తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు యం సుధాకర్‌ నాయుడు, క్లస్టర్‌ కన్నయ్య నాయుడు, సురేష్‌ బాబు, రవీంద్రబాబు, సుధాకర్‌, ఆనంద్‌, కుమార్‌ శెట్టి, గురవయ్య, బాబు, వీర రాఘవులు, హరి, శ్రీనివాసులు, చిరంజీవి రెడ్డి జనసేన నాయకులు నవీన్‌, బాలాజీ పాల్గొన్నారు.

➡️