క్షతీర్పును వెలువరించిన చిత్తూరు కోర్టుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ 9 సంవత్సరాల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి ఫోక్సో చట్టం కింది ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధిస్తూ ఫోక్సో సెక్షన్ జడ్జి శాంతి తీర్పును వెలువరించారు. కేసు పూర్వపరాలిలా ఉన్నాయి. చంద్రగిరి పోలీసు సబ్‌డివిజన్, తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో 2020 జూన్ 6వ తేదీ తిరుచానూరు ఎస్‌విపి కాలనీకి చెందిన నాథముని (40) తన కుమార్తె పుట్టినరోజు వేడుకకు ఇంటి చుట్టుపక్కల పిల్లల్ని ఆహ్వానించాడు. పుట్టినరోజు వేడుకల సందడిలో తొమ్మిది సంవత్సరాల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చింది. ఈ మేరకు తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ నిందితుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి, ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి ఎన్.శాంతి ముద్దాయి నాథమునిని దోషిగా తేలుస్తూ ఎనిమిదేళ్లు కఠిన కారాగారశిక్ష, మూడువేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. తిరుచానూరు సిఐ శివప్రసాద్‌రెడ్డిని ఎస్‌పి పి.పరమేశ్వరెడ్డి అభినందించారు.