ఎండియు వాహనాలకు జీపీఎస్‌శ్రీ నివేదిక సిద్ధం చేస్తున్న అధికారులుశ్రీ వృథా ఖర్చు అంటున్న నిపుణులు

ఎండియు వాహనాలకు జీపీఎస్‌శ్రీ నివేదిక సిద్ధం చేస్తున్న అధికారులుశ్రీ వృథా ఖర్చు అంటున్న నిపుణులు

ఎండియు వాహనాలకు జీపీఎస్‌శ్రీ నివేదిక సిద్ధం చేస్తున్న అధికారులుశ్రీ వృథా ఖర్చు అంటున్న నిపుణులుప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్న ఎండియు (మొబైల్‌ డెస్పెన్సింగ్‌ యూనిట్లు) వాహనాలకు త్వరలో జీపీఎస్‌ పరికరాలు అమర్చనున్నారు. ఇంటి వద్ద కాకుండా వీధుల్లో సరుకుల పంపిణీపై ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత వస్తుండటంతో దిద్దుబాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు వాహనాల ద్వారా ప్రజలకు సరుకులు అందిస్తున్నారు. వీధుల్లోకి ఎండియు వాహనం వచ్చిన సమయంలో కార్డుదారులు అందుబాటులో లేకపోతే ఇక రెండోసారి వాహనం ఆ ప్రాంతానికి రావడం లేదు. దీంతో చాలా మంది పేదలు రేషన్‌ సరుకులు తీసుకోలేకపోతున్నారు. దీనికి ప్రతినెలా పంపిణీ జరుగుతున్న సరుకుల శాతమే నిదర్శనం. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో సుమారు 80 శాతం మాత్రమే సరుకుల పంపిణీ జరిగింది. మిగిలిన 11 శాతం మంది పేదలకు సరుకులు అందడం లేదు. ఎండియు ఆపరేటర్లు ఇష్టానుసారం సరుకులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సరుకుల పంపిణీ తీరును పర్యవేక్షించే నాథుడు లేడని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో మండల సరఫరా అధికారులు ఉన్నా డిఎస్‌ఓ కార్యాలయంలో, ఎన్నికల విధుల్లో ఉంటున్నారు. దీంతో కొన్ని మండలాల్లో ఒక ఎంఎస్‌ఓ చొప్పున సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్‌ సరుకులు పంపిణీపై పర్యవేక్షన దాదాపు కొరవడింది. ఈ సమస్యను అధిగమించడానికి ఎండియు వాహనాలకు జీపిఎస్‌ పరికరాలు అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా వాహనాల ద్వారా నెలలో ఎన్నిక ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి బట్వాడాకు అవకాశల్లేని ప్రాంతాలెన్ని ఉన్నాయనే వివరాలను ఈఎల 25వ తేదీన సమర్చించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయానికి ఉత్తర్వులు రావడంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్న సుమారు ఆరు వందల ఎండియు వాహనాల వివరాలను సేకరిస్తున్నారు.నివేదిక సిద్ధం చేస్తున్నాం..ఎండియు వాహనాలకు జిపిఎస్‌ పరికరాలు అమర్చడానికి జిల్లాలో పరిస్థితిపై ఉన్నత అధికారులు నివేదిక కోరారు. దీనిపై కసరత్తు చేస్తున్నాం కొత్త సంవత్సరంలో ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సరకుల పంపిణీ మరింత పటిష్టంగా చేయడానికి కొత్త పరికరాలు అమర్చనున్నారు. జీపీఎస్‌తో అనుసంధానమైన తర్వాత జిల్లా కార్యాలయం, రాష్ట్ర కార్యాలయానికి ఆయా వాహనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుస్తుంది. తద్వారా ఎప్పటికపుడు పర్యవేక్షించి, ఇంటింటికీ సరుకుల పంపిణీ మరింత మెరుగ్గా పూర్తిచేయాలనే లక్ష్యమని జిల్లా పౌరసరఫరాల అధికారులు అంటున్నారు.వృధా ఖర్చు..ఎండియూ వాహన వ్యవస్థను తీసుకువచ్చి రేషన్‌ పంపిణీని అస్త్యవస్తం చేశారనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. సజావుగా నడుస్తున్న రేషన్‌ వ్యవస్థను కమీష్లను కోసం నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రజాధనాన్ని వృధాచేసి, వాహనాల కొనుగోలులో కమీషన్లు కోట్టేశారనే విమర్శనాలు ఉన్నాయి. గతంలో చౌక దుకాణాల వద్ద నెలలో అన్ని రోజులు సరుకులు ఇచ్చేవారు. కూలీ పనులకు వెళ్లేవారు; ఇతరత్రా పనులపై ఎక్కడికైన వెళ్లిణౄ వారు నెలలో తమకు అనుకూలమైన రోజుల్లో డీలర్లు నుంచి సరుకులు తెచ్చుకునే వారు. అయితే ఎండియూ వ్యవస్థ వచ్చాక పేదలకు పూర్తిస్థాయిలో సరుకులు అందడం లేదు. ప్రస్తుతం జిపిఎస్‌ పరికరాలు అమర్చుతామంటున్నారు. ఒక్కో పరికరానికి గరిష్టంగా రూ.0వేలు కేటాయించే అవకాశం ఉందని తెలిసింది. ఇదికూడా దోపిడీనే అని నిపుణులు అంటున్నారు. వృథా ఖర్చు తప్ప జీపిఎస్‌ వల్ల ఎలాంటి లాభం ఉండదని అంటున్నారు.

➡️