ఇసుక టిప్పర్ల నిర్వాకంకోట్లు కొట్టేశారు..కల్వర్టు కూల్చేశారు..!!కాగితాల దళితవాడ వద్ద కూలిన కల్వర్టుమూడు గ్రామాలకు రాకపోకలు అంతరాయంప్రజాశక్తి -తొట్టంబేడుప్రకతి సంపద కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.. అడ్డు అదుపు లేకుండా దోచేస్తున్నారు.. అడిగే వారే లేరు.. అడ్డుపడే వారు లేరు… ఇది అన్యాయం అని అడగడానికి ధైర్యం చేసి ముందుకు వచ్చే వారు కనుమరుగయ్యారు.. వాళ్లు చెప్పిందే రేటు. వాళ్లు ఎంత చెబితే అంత కట్టి ఇసుక తీసుకురావాల్సిందే. లేదంటే పోలీసులతో బెదిరిస్తారు. తిరగబడితే కేసులు పెట్టేస్తారు. గ్రామాలకు గ్రామాలు ఇబ్బంది పడుతున్నా యథేచ్ఛగా వారి పని వారు చేసుకుని పోతున్నారు. గ్రామాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నా చూసి చూడనట్లు వ్యవహరించాల్సిందే. ఇసుక టిప్పర్లను ఆపే ధైర్యం చేసే వాళ్లు కనిపించరు. గత ఏడాది కాగితాల హరిజనవాడ సమీపంలోని కల్వర్టు కూలిపోయింది. అయినా పట్టించుకోలేదు. అప్పట్లో పత్రికలలో కథనాలు ప్రచరణమైతే ఉన్న బ్రిడ్జిని తీసివేసి నామమాత్రంగా పైపులు వేసి చేతులు దులుపుకున్నారు. ఇది తొట్టంబేడు మండలంలో ఇసుక రీచ్ వారి తీరు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు శ్రీకాళహస్తి పట్టణం నుండి పూడి, పెన్నలపాడు, కాగితాల హరిజనవాడకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో ఓ కల్వర్టు ఉంది. ఈ కల్వర్టుపై యథేచ్ఛగా ఇసుక టిప్పర్లు అధిక లోడ్‌తో తిరుగుతూ ఉంటాయి. మూడు రోజులుగా వర్షాలు కురవడంతో ఆ కల్వర్టు టిప్పర్ల ధాటికి కూలిపోయింది. దీంతో మూడు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గత ఏడాదీ ఇసుక టిప్పర్ల వల్ల ఈ కల్వర్టు కూలిపోయింది. నామ మాత్రంగా పైపులు వేసి చేతులు దులుపుకోవడంతో మళ్ళీ ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని గ్రామస్తులు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ కల్వర్టు మరమ్మత్తులు చేపట్టి గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇసుక టిప్పర్ల లోడ్‌కు కూలిన కల్వర్టు