ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం

Nov 28,2023 22:56
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ఆధునికీకరణ, యువతకు మరింత మెరుగైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌)తో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్య అభివద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్స్ట్రక్షన్‌ (ఎన్‌ఎసి) సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని కలెక్టర్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) సీజీఎం యోహాన్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యఅభివద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్స్ట్రక్షన్‌ (ఎన్‌ఎసి) సంయుక్తంగా ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈఒప్పందం ద్వారా 240 కుట్టుమిషన్లను ఐవోసీఎల్‌ ద్వారా ట్రైనింగ్‌ అయినటువంటి అన్‌ ఎంప్లాయిస్‌కు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని, పైప్‌లైన్‌లు కల గ్రామాలకు ఆర్‌ఓ యూనిట్లను ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగిందని, ఫ్యూచర్లో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబుల్‌ కింద ఐఓసీఎల్‌ కంపెనీ తరఫున మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు మన చిత్తూరు జిల్లా ప్రజలకు అందిస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాంసబిలిటీ (సిఎస్‌ఆర్‌) ఫండ్‌ కింద రూ.18,65,200 చెక్కును జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. కే.దినేష్‌ కుమార్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ అఫ్‌ ఎన్‌ఎసి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్ట్‌ అఫ్‌ ఎపిఎస్‌ఎస్‌డిసి ఆర్‌.బాలమురుగన్‌ సీనియర్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌, సిహెచ్‌.రఘువంశి, ఆపరేషనల్‌ మేనేజర్‌, ఎన్‌.శ్యాంమోహన్‌, ఆర్‌ఎస్‌డిఓ, అఫ్‌ ఎపిఎస్‌ఎస్‌డిసి, ఎం.గుణశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️