అవగాహనతోనే ఎయిడ్స్‌ నిర్మూలన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విసి ఆచార్య డి భారతి

అవగాహనతోనే ఎయిడ్స్‌ నిర్మూలన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విసి ఆచార్య డి భారతి

అవగాహనతోనే ఎయిడ్స్‌ నిర్మూలన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విసి ఆచార్య డి భారతిప్రజాశక్తి – క్యాంపస్‌ : విస్తత పరిశోధనల ద్వారా, సమచార వ్యాప్తి ద్వారా ఎయిడ్స్‌కు అడ్డుకట్ట వేయవచ్చని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ భారతి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఎన్‌.ఎస్‌.ఎస్‌ యూనిట్లు3, 8, 9, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ సౌజన్యంతో హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై బుధవారం అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ భారతి మాట్లాడుతూ విస్తత పరిశోధనల ద్వారా, సమాచార వ్యాప్తి ద్వారా ఎయిడ్స్‌కు అడ్డుకట్ట వేయవచ్చని ఈ రెండు అంశాలలో మహిళా విశ్వవిద్యాలయం ముందంజలో ఉందన్నారు. సేవా భావాన్ని అధ్యాపకులు, విద్యార్థినులు అల వర్చకుని సమాజాన్ని జాగరూకత చేస్తోందని తెలిపారు. అడిషనల్‌ డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ అరుణ సులోచన మాట్లాడుతూ ప్రభుత్వం ఎయిడ్స్‌ నివారణకు చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. స్థానిక రుయా హాస్పిటల్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ బాలాజీ, హెచ్‌ఐవి సోకే విధానం, లక్షణాలు, చికిత్స విధానం, తదితర అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ బ్యూరో కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ విద్యావతి, డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ లలిత, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్‌ నీరజ, డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ కిషోరి, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️