‘అభివృద్ధిని అడ్డుకుంటే తిరుగుబాటు తప్పదు

'అభివృద్ధిని అడ్డుకుంటే తిరుగుబాటు తప్పదు

‘అభివృద్ధిని అడ్డుకుంటే తిరుగుబాటు తప్పదు’ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: తిరుపతి నగర అభివృద్ధికి టిటిడి ఒక శాతం నిధులను కేటాయిస్తూ తీసుకున్న తీర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న బిజెపి నాయకులకు నగరంలో తిరుగుబాటు తప్పదని వైసిపి నాయకురాలు మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యురాలు రుద్రరాజు శ్రీదేవి హెచ్చరించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ అభినరు దూరదష్టితో నగరాన్ని చరిత్రపుటల్లో నిలిపే విధంగా అభివద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు. నగరాభివృద్ధిని చూసి ఓర్వలేక బిజెపి నాయకులు భానుప్రకాష్‌ రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. తెలంగాణలోని భద్రాచలం ఆలయానికి రూ.2కోట్లు అప్పు ఉండగా టీటీడీ చెల్లించిన విషయాన్ని బిజెపి నాయకులు గుర్తుంచుకోవాలని, అప్పుడు అడ్డుకోని బీజేపీ నాయకులు యాత్రికుల సౌకర్యాలను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు నగరాభివృద్ధికి సహకారం అందించకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్పొరేటర్‌ దూది కుమారి, తాతయ్యగుంట గంగమ్మ గుడి మాజీ డైరెక్టర్‌ గౌరీ, పెద్ద గంగమ్మ ఆలయ మాజీ డైరెక్టర్‌ పద్మజ, వార్డు సభ్యురాలు మంజుల పాల్గొన్నారు.

➡️