అంగన్‌వాడీలకు హామీలు అమలయ్యేనా..?

అంగన్‌వాడీలకు హామీలు అమలయ్యేనా..?

అంగన్‌వాడీలకు హామీలు అమలయ్యేనా..?సమ్మెకు సన్నద్ధమవుతున్న అంగన్‌వాడీలుప్రజాశక్తి- తిరుపతి సిటి: అంగన్‌వాడీలు లేని ఊరు లేదు. అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు అమలైన దాఖలాలు లేవు. పసిపిల్ల్లలు, గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం, వారి ఆర్యోగంపై శ్రద్ద చూపడం, పిల్లల ఆలనా పాలన చూపడంలో అంగన్‌వాడీ వర్కర్ల సేవలు కీలకం. కానీ నిత్యం సమస్యలతో సతమతమవడం షరామామూలే. కనీస వేతనాలు కూడా ఇవ్వని పరిస్తితి. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా వీరి పరిస్థితులు మాత్రం మారలేదు. నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, వంటావార్పులు చేసిన ఫలితం శూన్యం. విధిలేని పరిస్థితుల్లో సమ్మె బాటపట్టేందుకు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మెబాట పట్టనుండడం గమనార్హం. ఐసిడిఎస్‌ పరిరక్షణ కోసం, అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్‌, పిఎఫ్‌, ఐఎస్‌ఐ గ్రాట్యూటి అమలు తదితర వాటిపై అంగన్‌వాడీలు సంవత్సరాల తరబడి పోరాడుతూనే ఉన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలైన అంగన్‌వాడీల సమస్యలు పరిస్కారం చెయ్యలేదు. పైగా ఐసిడిఎస్‌ లక్ష్యానికి విరుద్దంగా సెంటర్లు కుదించడానికి నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలను అనేక రెట్లు పెరిగాయి. కానీ ధరలకు అనుగుణంగా వేతనాలు నయాపైసా కూడా పెంచలేదు. అంగన్‌వాడీల పోరాటాల ఫలితంగా 2018లో వర్కర్లకు 1500, హెల్పర్‌కు రూ.750, మినీ వర్కర్‌కు రూ.1250లు పెంచుతున్నామని ప్రకటన చేసిన ఇంతవరకు అమలు చేయ్యలేదు. 2017 నుంచి టిఎ బిల్లులు ఇవ్వడం లేదు. 2022 ఏఫ్రిల్‌ 25 అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ ఉద్యోగులకు 1972 చట్టం ప్రకారం గ్రాట్యూటికి అర్హులని తెలియజేసింది. కానీ అంగన్‌వాడీలకు గ్రాట్యూటి ఇప్పటి వరకు అమలు చేయ్యలేదు. లబ్దిదారులను కుదించడానికి పోషణ ట్రాక్‌యాప్‌ను తీసుకొచ్చింది. ప్రైవేటీకరణ విధానంలో భాగంగా రకరకాల యాప్‌లు తెచ్చి వారిపై పనిభారం పెంచారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2023-24వ సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ వల్ల 26లక్షల మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లతో పాటు కోటి మందిగా ఉన్న స్క్రీం వర్కర్లకు ప్రయోజనం కలగలేదు. ఐసిడిఎస్‌కి నామమాత్రంగా రూ.291.24 కోటు బడ్జెట్‌ పెంచినప్పటికి పెరుగుతున్న ధరలతో ఇది ఏ మాత్రం సరిపోదు. గత 48 సంవత్సరాల నుంచి గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అనేక సేవలందిస్తున్న అంగన్‌వాడీలకు కనీసం ఉద్యోగ భద్రత కల్పించలేదు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం పరిస్థితి అంతే. అంగన్‌వాడీలకు తెలంగాణా కన్న అదనంగా వేతనాలు పెంచుతానన్న ముఖ్యమంత్రి హామీ నీటి మీద రాతగా మిగిలింది. సెంటర్ల నిర్వహణకు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితికి అంగన్‌వాడీలు నెట్టబడ్డారు. అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షణ పేరుతో పుడ్‌ కమీషనర్‌, ఎంఎస్‌కె, ఎంఆర్‌ఓ, ఎండివో, రాజకీయ నాయకులు ఇలా అనేక మంది విజిట్ల పేరుతో అంగన్‌వాడీలను అవమానిస్తూ, వేధింపులకు గురి చేయడం నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. ఇలాంటి అనేక సమస్యల నడుము అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఇబ్బందులు పడుతూనే, తమ సేవలను అందిస్తున్నారు. పాలకులు తీరులో మార్పు మాత్రం రావడం లేదు. అనేక ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, వంటావార్పులు చేసిన ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో డిసెంరు 8 నుంచి నిరవాధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాలు పెట్టి, అందరిలో చైతన్యం తీసుకొస్తున్నారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం అంగన్‌వాడీ జిల్లా కార్యదర్శి వాణిశ్రీ అధ్యక్షతన తిరుపతిలో జిల్లాస్థాయిలో అంగన్‌వాడీ యూనియన్ల రౌండ్‌టేబుల్‌ నిర్వహించారు. దీనికి సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు ముఖ్యఅతిథిగా హజరై అంగన్‌వాడీ పోరాటాలకు మద్దతు తెలియజేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి, అంగన్‌వాడీలను ఆదుకుని, వారి నాణ్యమైన డిమాండ్లను పరిస్కరించి, సమ్మెకు వెళ్లనీయకుండా నిలవరిస్తారని ఆశీద్దాం.

➡️