ప్రజాశక్తి-వెదురుకుప్పం : మండలంలోని పచ్చికాపల్లంలో దొంగల సంచారం అధికమయ్యాయి. మొన్న జెసిబిల బ్యాటరీలు దొంగతనానికి గురైన ఘటన మరువక ముందే బుధవారం రాత్రి హరిత జువెలరీ దుకాణంలో చొరబడేందుకు ప్రయత్నించారు. దొంగతనానికి పాల్పడే ప్రయత్నంలో స్థానికులు గురువారం కనుక్కోవడంతో పరార్ అయినట్టు చెబుతున్నారు. వరుస దొంగతనాలతో పచ్చికాపలం ప్రజలు వణికి పోతున్నారు. రోజు దొంగతనాలు పెరిగిపోతున్నా పట్టించుకునే వారు లేదని స్థానికులు వాపోతున్నారు. నిఘా లేకపోవడంతోనే దుకాణాల్లో రోజురోజుకీ దొంగతనాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. గట్టి నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలు అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
