బర్రెలక్కకు మద్దతుగా కుడుపూడి

Nov 27,2023 12:25 #Kakinada
support to barrelakka

ప్రజాశక్తి – తాళ్లరేవు : తెలంగాణ లోని కొల్లాపూర్ జనరల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దళిత మహిళ కర్ర్నే శిరీష అలియాస్ బర్రెలక్క కు ముమ్మిడివరం ఏ.ఎం.సి. చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజక వర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం బర్రెలక్క స్వగృహానికి వెళ్లి రూ.35, 000 నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శివన్నారాయణ మాట్లాడారు. పేద దళిత విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి ప్రజలందరూ కృషి చేయాలని కోరారు. అనంతరం ఆమెకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న బర్రెలక్కను ఆయన దుస్సాలువతో సత్కరించి అభినందించారు. ఆయన వెంట పెంకే అర్జున్, జి.సోను, కుడుపూడి శ్రీనివాస్, కోరుకొండ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

➡️