ప్రజాశక్తి-పిడుగురాళ్ల : అంగన్వాడి సమస్యల పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 8వ తేదీ నిర్వహించే నిరవధిక సమ్మెలో తామూ పాల్గొంటున్నట్లు అంగన్వాడీలు ప్రకటించారు. ఈ మేరకు నోటీసును పిడుగురాళ్ల ప్రాజెక్టు సూపర్వైజర్ అన్నపూర్ణకు సిఐటియు ఆధ్వర్యంలో మంగళశారం అందించారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారానికి రాకముందు తాను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు పెంచుతానని హామీనిచ్చిన దాన్ని అమలు చేయలేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటిని వెంటనే అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు టిఎ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. వీటి సాధన కోసం చేపట్టే సమ్మెలో అంగన్వాడీలంతా భాగస్వ్యామం కావాలన్నారు. దీంతోపాటు బుధవారం ఉదయం 10 గంటలకు అంగన్వాడి ప్రాజెక్టు ఆఫీస్ వద్ద ధర్నాని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ జయశ్రీ, శివకుమారి, శాంతి కుమారి పాల్గొన్నారు.