రూ.20 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

 

ప్రజాశక్తి – నందిగామ : నందిగామ పట్టణంలో ఇటీవల జరిగిన దొంగతనాల కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ.20 లక్షల విలువైన చోరీ సొత్తు శనివారం స్వాధీనం చేసుకున్నారు. 13 కేసుల్లో చోరీ కాబడిన సుమారు 156 గ్రాముల బంగారం, 8.820 గ్రాముల వెండి ఆభరణాలు, దొంగతనానికి ఉపయోగించిన కారు, బైకులను రూ.40 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్‌.టి.ఆర్‌.జిల్లా నందిగామ టౌన్‌ ఎన్‌.టి.ఆర్‌.రోడ్లు ఏరియాలో, నందిగామ టౌన్‌ లోపల ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న ఇళ్ళ తాళం పగలగొట్టి దొంగతనం చేశారని ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నందిగామ పోలీసులు సదరు సంఘటనా స్థలాలకు చేరుకొని విచారించి కేసులను నమోదు చేసిన విషయం విదితమే. పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి దర్యాప్తు చేశారు. సబ్‌ డివిజన్‌ ఏ.సి.పి. శ్రీ జనార్ధన నాయుడు, నందిగామ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ జె.ఆర్‌.కె.హనీష్‌ వారి సిబ్బందితో కలిసి మూడు బందాలుగా ఏర్పడి సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిచుకుని అనుమానితులు, పాత నేరస్తుల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అనాసాగారం కొత్త బైపాస్‌ సర్వీస్‌ రోడ్డు సమీపంలో అనుమానితుడైన వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారించగా ప్రకాశం జిల్లా. చీరాల టౌన్‌ నవాబ్‌ పేటకు చెందిన షేక్‌ అల్తాఫ్‌ ఏ అప్పు ఏఆఫ్రోజ్‌ (43) అను వ్యక్తిలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు కంచికచర్ల గ్రామానికి చెందిన మణికంఠను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేశారు. నిందితులు సుమారు 70 వరకు దొంగతనాలు చేశారని పోలీసులు తెలిపారు.

➡️