ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: ఏఎంసి, బిఎంసి భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జెసి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఆరు మండలాల్లో 103 పాల కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించిన మేరకు పెడింగ్‌లో ఉన్న భవన నిర్మాణ పనులు త్వరితన పూర్తి చేయాలని సూచించారు. ఆరు బిఎంసిలను పూర్తి చేసి అప్పగించాలన్నారు. డిసెంబర్‌లో ప్రారంభించాలనుకున్న మరో 165 పాల కేంద్రాలకు సంబంధించి పనులు త్వరతన చేపట్టాలని, ఆ దిశగా కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డైరీ డెవెలప్మెంట్ అధికారి రవిచంద్రన్, డిసివో బ్రహ్మానందరెడ్డి, ఎస్‌ఈపిఆర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈ పిఆర్ చంద్రశేఖర్‌రెడ్డి, డిడి సోషల్ వెల్ఫేర్ రాజ్యలక్ష్మి, ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్స్ బాషా, డిఎల్‌డివో రవికుమార్, అమూల్ డైరీ ప్రతినిధి నవీన్ పాల్గొన్నారు.