ఎస్ఐ శ్రీను నాయక్
ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని రహదారులపైనా, గ్రామాల్లోను రాత్రి వేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆలమూరు ఎస్సై ఎల్.శ్రీను నాయక్ వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఆయన సిబ్బందితో పర్యటించారు. ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న కొందరిని, అనుమతులు లేకుండా వెళుతున్న లారీలను ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి కారణాలు లేకుండా రాత్రి వేళల్లో తిరిగితే చట్టం తన పని తాను చేసుకు పోతుందని హెచ్చరించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తగిన కారణాలు చెప్పాలని అన్నారు. అలాగే వాహనాలకు సంబంధించిన రికార్డు పోలీసులు అడిగిన తక్షణం వారికి చూపించి సహకరించాలని అన్నారు. అలాగే కొత్తూరు, జొన్నాడ సెంటర్లలో, మడికి నుండి జొన్నాడ వరకు జాతీయ రహదారిపై నిరంతరం నిఘా ఉంచామని తెలిపారు.