భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)
జగ్గయ్యపేట: నియోజకవర్గంలో ఉన్నా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు డి.వై.ఈ.ఓ వచ్చిరని తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు వివిధ సమస్యలుతో కూడిన వినతిపత్రం ఆయనకు ఇవ్వడానికి వెళ్లిన సందర్భంలో ఆయన నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడం మరియు అవి నాకు సంబంధం లేదని మాట్లాడటం సరైనది కాదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం సోమేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు జి గోపి నాయక్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అనేక రకాల సమస్యలుంటే విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై కొన్ని నెలలు గడుస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో నాడు – నేడు పనులు పూర్తవుపోవడం, క్లాస్ రూమ్ లు సరిగా లేకపోవడం, కొన్ని పాటశాలలో టీచర్ల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం, అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఏం సమస్యలున్నాయి. వాళ్లు ఏ ఇబ్బందులు పడుతున్నారు. ఇవి తెలుసుకోవడంలో ఆయన విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల దగ్గర్నుంచి కార్పొరేట్ విద్యాసంస్థలు వేలకు, వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న డి.వై.ఈ.ఓ చూస్తూ చూడనట్టు వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. సరైన వసతులు లేనటువంటి పాఠశాలలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయనను ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన డి వై ఇ వో పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని, విద్యార్థుల సమస్యలు పట్టించుకోని డి వై ఈ వో ను వెంటనే సస్పెండ్ చేయాలని వారి డిమాండ్ చేశారు.