నిర్బంధాలు నెదిరించి వ్యక్తి పినకాన

Nov 22,2023 16:18 #srikakulam

ప్రజాశక్తి-టెక్కలి రూరల్(శ్రీకాకుళం) : నిర్బంధాలు నెదిరించి శ్రమజీవులు పక్షాన నికరముగా నిలబడి పోరాటం చేసిన యోధుడు పినకాన క్రిష్ణమూర్తి అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బవిరి కృష్ణమూర్తి అన్నారు. బుధవారం పినకాన క్రిష్ణమూర్తి ఏడవ వర్ధంతి సభ చిన్న లక్షింపురంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన జరిగింది. మొదట ఆయన స్థూపం వద్ద పూలమాలలువేసి నివాళ్లుర్పించారు. అనంతరం సభలో వారు మాట్లాడుతూ పినకాన కృష్ణమూర్తి తన యావత్ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారని కొని ఆడారు. తర్లా జమీందారీ భూములపై ఎకరాకు 14 రూపాయల 25 పైసలు శిస్తు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమని సత్యాగ్రహం నడిపిన వ్యక్తిని వారన్నారు. ఆ పోరాట ఫలితంగా ప్రభుత్వం ఆరు రూపాయలు శిస్తు తగ్గించవలసి వచ్చిందని వారు గుర్తు చేశారు. పినకాన కృష్ణమూర్తి గారు గిరిజనలకు అటవీ సంపద పైన హక్కుల కోసం, పోడు పట్టాలు కోసం అనేక గిరిజన ఉద్యమాల నడిపినారని వారు గుర్తు చేశారు. కార్మిక రైతాంగ ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో కామ్రేడ్ కృష్ణమూర్తిగారు కీలకపాత్ర పోషించారని వారు కొనియాడారు. ఆప్ సోర్ రిజర్వాయర్ నిర్మించాలని రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారని వారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన ప్రజా వ్యతిరేక విదానాలు పైన, పెంచుకు పోతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేపట్టారని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే అధికార ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నిలదీయడం లేదని వారు ప్రశ్నించారు. విశ్వసముద్రం పేరుతో ఈ జిల్లాలో ఉండే మైనింగ్ ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, ఐటిడిఎ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే కామ్రేడ్ కృష్ణమూర్తికి మనం ఇచ్చిన ఘనమైన నివాళి అని వారు అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు కోనారి మోహనరావు, న్యాయవాది పినకాన అజయ కుమార్, కాంగ్రెస్ కిసాన్ జిల్లా నాయకులు కోత మధు,కింతల ధర్మారావు,, పాళిన సాంబమూర్తి, హెచ్ ఈశ్వరరావు, బగాది వాసుదేవరావు, మామిడి వసంత రావు ముడీదాన ఆదినారాయణ, స్టాలిన్ తదితరులు మాట్లాడారు. పినకాన క్రిష్ణమూర్తి కుటుంబ సభ్యులు బంధువులు గిరిజనులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️