పాలకోడేరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే పకడ్బందీగా జరుగుతోందని భీమవరం ఆర్‌డిఒ కె.శ్రీనివాసులు రాజు అన్నారు. విస్సాకోడేరు సచివాలయంలో రీసర్వేపై మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్‌డిఒకు సర్పంచి బొల్ల శ్రీనివాస్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభకు సర్పంచి బొల్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ఆర్‌డిఒ శ్రీనివాసులు రాజు మాట్లాడారు. వందేళ్ల తర్వాత రీసర్వే ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సర్వేకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ షేక్ హుస్సేన్, రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు.