ఇళ్ల స్థలాలిచ్చే వరకూ పోరాటం ఆగదు

Nov 11,2023 22:00 #Sri Satya Sai District

చిలమత్తూరు : పేదలకు కోడూరు సర్వేనెంబర్‌ 805-6, 805-7 జగనన్న లేఅవుట్‌లో ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకూ పోరాటం కొనసాగుతుందని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెదన్న స్పష్టం చేశారు. శనివారం నాడు పేదలు వేసుకున్న గుడిసెలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడూరు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలకు అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. అధికార పార్టీ నాయకులు చేతనైతే ఇళ్ల పట్టాలు ఇప్పించాలని గానీ, ఇలా బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. ఇలాంటి బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదన్నారు. పేదలకు జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన హామీ మేరకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇళ్ల స్థలాల ఇచ్చేవరకూ పేదల పక్షాన సిపిఎం, వ్యకాసం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం సిపిఎం నాయకులు ఫిరంగి ప్రవీణ్‌ కుమార్‌, రామచంద్ర, లక్ష్మి నారాయణ, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ సభ్యులు చందు, సదాశివరెడ్డి, రహంతుల్లా, నరసింహ, మణిస్వామి, వేణు రాయల్‌, నాగరాజు, యస్మిన్‌ తాజ్‌, అలివేలమ్మ పాల్గొన్నారు.

➡️