విద్యార్థులకు బహుమతులు ప్రదానం

Nov 21,2023 19:48 #Nellore District

ప్రజాశక్తి-ఉదయగిరి:56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ గాజుల తాజుద్దీన్‌ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ,తతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్‌ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు మేధాశక్తిని పెంపొందిస్తాయన్నారు. చిన్ననాటి నుంచి గ్రంథాలయంలో పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. ఒకప్పుడు గ్రంథాలయాలకు వెళ్లాలంటే కాలినడకన వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండేవారమన్నారు. నేడు ఆ పరిస్థితులు లేకుండా విద్యార్థుల కోసం ప్రభుత్వం చక్కగా భవనం నిర్మించి పాఠ్య పుస్తకాలు, నవలలు, తెలుగు దినపత్రికలు, మాస పత్రికలు, క్రీడలకు,ఆటల పోటీలకు ఉపయోగపడే పుస్తకాలు నేడు అందుబాటులోకి తెచ్చేయన్నారు. గ్రంథాలయంలో చదివిన వారు నేడు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మీరు కూడా ఆ స్థాయికి వెళ్లాలంటే పుస్తక పఠనం తప్పనిసరి అన్నారు. ఈనెల 14 నుంచి ప్రారంభమైన గ్రంథాలయ వారోస్తవాలు నేటితో ముగించడం కొంచెం బాధగా అనిపించినా ఎనిమిది రోజులపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నెరవేర్చినందుకు గ్రంథాలయ నిర్వాకులు షేక్‌ ఫజుల్లకు అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఎంఇఒ మస్తాన్‌వలి, జూనియర్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ కిరణ్‌, హైస్కూల్‌ ఉపాధ్యాయులు అంజాద్‌ బాషా, వాణి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️