ప్రజాశక్తి-సోమల : సోమల మండలం నందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం సూరయ్య గారి పల్లె వద్ద నూతన సచివాలయ భవన ప్రారంభం చేశారు. ఆవుల పల్లె వద్ద సోమేశ్వరస్వామి ఆలయ జీర్ణోదరణ పనులకు భూమి పూజ, పెద్ద ఉప్పరపల్లి నందు రెండు నూతన బస్సు సర్వీసుల ప్రారంభం చేశారు. బోనమందలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం కార్యక్రమాలను నిర్వహించారు.
