గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట:ఎంపీపీ యువరాజ్

Nov 28,2023 17:16 #chitoor

ప్రజాశక్తి-వి కోట(చిత్తూరు) : ప్రభుత్వ నిధులతో చేపడుతున్న సిమెంట్ రోడ్ల నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించి, గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎంపీపీ యువరాజ్ తెలిపారు. మండల పరిధిలోని ముదరందొడ్డి పంచాయతీ సుద్దులకుప్పం లో మంగళవారం ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆదేశాల మేరకు నూతన సిసి రోడ్డు నిర్మాణానికి స్థానిక సర్పంచ్ దామోదర్, ఎంపీపీ యువరాజ్ భూమి పూజ నిర్వహించారు. గత 20 ఏళ్ల నుండి అధ్వాన స్థితిలో ఉన్న మట్టి రోడ్డును సీసీ రోడ్డుగా మార్చేందుకు ఎమ్మెల్యే చొరవ చూపి 32 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరలో డ్రైనేజీ కాలువ నిర్మాణాన్ని కూడా కృషి చేస్తానని ఎంపీపీ ప్రజలకు హామీ ఇచ్చారు. పనులు చేసే ప్రభుత్వాన్ని మరల ఆదరించాలని ఎంపీపీ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మీరు వెంట వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రెడ్డి, నేతలు భూపతి యాదవ్, ప్రభాకర్ రెడ్డి, నారాయణస్వామి, దామోదర్, బాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

➡️