రేపటి నుంచి జాతీయ క్రీడా పోటీలు

Nov 18,2023 14:28 #Krishna district, #Sports

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు :  శేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు జాతీయస్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జివిఎస్‌ఎన్‌ఆర్‌వి ప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ జాతీయ స్థాయి అంతర ఇంజనీరింగ్‌ కళాశాలల టోర్నమెంట్‌ లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 2500 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఇందులో మహిళలకు మరియు పురుషులకు వేరు వేరు విభాగాల్లో బాస్కెట్‌ బాల్‌, టెన్నీస్‌, టేబుల్‌ టెన్నిస్‌, వాలీబాల్‌, ఖో-ఖో, కబడ్డీ, రోప్‌ స్కిప్పింగ్‌ క్రీడలను అథ్లెటిక్స్‌ ను నవంబర్‌ 18 నుండి 20 వ తేదీ వరకు నిర్వహించనున్నామనీ, ప్రత్యేకంగా అథ్లెటిక్స్‌ ను ఉదయం 6 గంటల నుండి9 గంటల నుంచి వరకు తిరిగి సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహి స్తామని, అంతర ఇంజనీరింగ్‌ కళాశాలల టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మరియు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ మత్తి శివశంకర్‌ తెలియజేశారు. ఈ పోటీలకు విచ్చేసే క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కళాశాల యాజమాన్యం తగిన ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏలూరు రేంజ్‌ డి.ఐ.జి. ఆఫ్‌ పోలీస్‌ జి.వి.జి. అశోక్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి డాక్టర్‌ నైనా జైస్వాల్‌ గౌరవ అతిథిగా విచ్చేయనున్నట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు.

➡️