ప్రజాశక్తి – కశింకోట : కసింకోటలో ముఠా కార్మికులకు మహాధర్న కరపత్రాల జిల్లా సిఐటియు నాయకులు దాకారపు శ్రీనివాసరావు పంపిణీ ఆదివారం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాటలుడుతూ విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో జరుగుతున్న మహా ధర్నాను జయప్రదం చేయాలి అని కోరారు. రెక్కాడితేనే కానీ డొక్కనిండని పరిస్థితిలో జీవనం గడుపుతున్న ముఠా కార్మికులకు వస్తున్న కూలి డబ్బులు చాలక అధిక ధరలతో నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక ఆర్థిక పరిస్థితితో సతమత మవుతున్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం 2015 నుండి కార్మిక మహాసభలను జరపడం లేదు. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ చట్టాలను మార్చడం వల్ల ముఠా కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది .50 సంవత్సరాలు నిండిన ముఠా కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, పీ.ఎఫ్ .ఈ.ఎస్.ఐ. సౌకర్యం కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27 మరియు 28 తేదీలలో విజయవాడ జింఖానా గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు కరెంటు చార్జిలు తగ్గించాలని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఇసుక, సిమెంట్, ఐరన్, ధరలు తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి.లోవరాజు, దొరబాబు, జెర్రిపోతల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.