రైతులందరికీ రుణాలు

Nov 20,2023 23:19 #Konaseema

 

డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు

ప్రజాశక్తి- కాట్రేనికోన : రైతు నేస్తం పథకం ద్వారా ప్రతి రైతుకూ పంట రుణాలను అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ ఆకుల వీర్రాజు పేర్కొన్నారు. కాట్రేనికోన మండల పరిధిలోని కందికుప్ప సొసైటీ ఛైర్మెన్‌ యేడిద సుబ్బారావు అధ్యక్షతన 70వ అఖిలభాతర సహకార వారో త్సవాలు ముంగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఛైర్మన్‌ వీర్రాజు మాట్లాడారు. రైతు నేస్తం పథకం ద్వారా ఎకరా భూమి ఉన్న రైతుకు రూ.8లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రుణాన్ని పదేళ్లలో పది సమాన వాయిదాల్లో చెల్లించొచ్చన్నారు. ఒక రైతుకు గరిష్టంగా రూ.36 లక్షల వరకూ రుణం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై వడ్డీ 12 శాతం మాత్రమే నన్నారు. రైతులంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 76 ఏళ్ల నిండిన సీనియర్‌ సిటిజన్లకు డిపాజిట్లపై 0.77 శాతం అదనపు వడ్డీ ఇస్తున్నానట్లు ఆయన తెలిపారు. తమ బ్యాంక్‌ పరిదిలో బంగారు రుణాల టర్నోవర్‌ రూ.500 కోట్లు దాటిందన్నారు. బంగారంపై రూ.25 కోట్ల రుణాలు అందించిన బ్రాంచిలకు గోల్డ్‌ లోన్‌ ప్రత్యేక సెల్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ముమ్మిడ ివరం ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌ మాట్లాడుతూ రైతులకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి ఆర్థికాబివృద్ధికి వైసిపి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో తూర్పు డెల్టా చైర్మన్‌ యేడిద చక్రపాణిరావు, డిసిసిబి జిఎం పి.ప్రవీణ్‌కుమార్‌, డిసిసిబి డైరెక్టర్‌ బండారు రాజా, సహకార వారోత్సవాలు ఇన్‌ఛార్జ్‌ అదిమూలం వెంకటేశ్వర రావు, జిల్లా కో ఆపరేటివ్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ ఎస్‌.మురళీకృష్ణ, జడ్‌పిటిసి సభ్యులు నేల కిషోర్‌కుమార్‌, వైసిపి అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, ఆర్‌బికె చైర్మన్‌ నాతి సత్యనారయణ, సర్పంచ్‌లు గంటి వెంకట సుధాకర్‌, మల్లాడి వీరబాబ్జి, చలగల వెంకటలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

➡️