హింస లేని సమాజం కోసం ఉద్యమిద్దాం : ఐద్వా

Nov 26,2023 16:03 #aidwa, #prakasam

 ప్రజాశక్తి-ప్రకాశం : అంతర్జాతీయ హింస వ్యతిరేక దినం సందర్భంగా హింస లేని సమాజం కోసం ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా నాయకురాలు నెరుసుల.మాలతి పిలుపునిచ్చారు. రోజురోజుకీ సమాజంలో మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న హింస, అకత్యాలను అరికట్టాలని స్థానిక జడ్పీ హైస్కూల్‌ వద్ద ఐద్వా ఆధ్వర్యంలో ఆదివారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న హింస, అత్యాచారాలు, వరకట్న హత్యలు, గృహహింస, లైంగిక వేధింపులు లాంటివి అరికట్టాలనే లక్ష్యంతో 1999 నుండి ఐక్యరాజ్యసమితి నవంబర్‌ 25వ తేదీని హింస వ్యతిరేక దినంగా ప్రకటించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున హింసకు వ్యతిరేకంగా అనేక సభలు, సమావేశాలు, చర్చా ఘోస్ట్‌లు జరుగుతున్నాయని తెలిపారు. స్త్రీలపై జరుగుతున్న హింసను, అఘాయిత్యాలను అరికట్టాల్సిన పాలకులు వాటిని పెంచి పోషించేందుకు దోహదపడటం సిగ్గుచేటని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక మహిళలపై అరాచకాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను వంటింటికి పరిమితం చేయాలనే మనుధర్మ శాస్త్రం ఆధారంగా బిజెపి పాలన సాగుతుందని అందులో భాగంగానే ఇటువంటి అఘాయిత్యాలు పెరుగుతున్నాయని అన్నారు. స్త్రీలపై జరుగుతున్న హింసకు కారకాలుగా ఉన్న మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలని, దాడులు, అకత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అశ్లీలతకు విచ్చలవిడి కేంద్రాలుగా మారిన సెల్ఫోన్లో పోర్న్‌ వీడియోలను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. మహిళా చట్టాలను పార్టీష్టంగా అమలు చేయడానికి వర్మ కమిటీ చేసిన సిఫార్సులనుఅమలు చేయాలని అన్నారు.. ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని హింస నివారణకు ప్రత్యేక కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు కె.లత పాల్గొన్నారు.

➡️