నకిలీ స్టాంపులపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి

Nov 27,2023 15:14 #Prakasam District
left parties protest on fake stamps

ప్రజాశక్తి-ఒంగోలు : ఒంగోలులో నకిలీ స్టాంపులు, భూ కుంభకోణాలు భూ ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని కోరుతూ సిపిఎం, సిపిఐ ఒంగోలు నగర కమిటీల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో నకిలీ స్టాంపులు భూ కుంభకోణాలు భూ ఆక్రమణల పై సి ట్ విచారణ జరుగుతుంది. విచారంలో భూములకు సంబంధించిన రికార్డులను రెవెన్యూ అధికారులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. దీని వలన నష్టపోయి, తమ భూమి ఆక్రమణకు గురైన బాధితులకు న్యాయం జరగడం లేదు. అధికార పార్టీ అండదండలతో పోలీస్ స్టేషన్ లో కొన్ని కేసులో రాజీ జరుగుతున్నవి. అందుకని బాధితులకు న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జి చేన్యాయ విచారణ జరిపించాలని కోరారు. భూముల కోల్పోయిన బాధితులకు వెంటనే భూమిని అప్పగించాలని కోరారు. నకిలీ స్టాంపులు తయారీదారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి పివిఆర్ చౌదరి మాట్లాడుతూ అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన అక్రమ జీపీలు చేస్తున్న రిజిస్ట్రేషన్ అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కుంభకోణాలు వెనుక ఉన్న రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులపై చర్యలు చేపట్టాలని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పేర్న మిట్ట 190 సర్వే నెంబర్లు రెండు ఎకరాల30 సెంట్లు ఆక్రమించిన వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు పురిణి ప్రభావతిపై చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని కోరారు. వెంగమక్కపాలెం పోయే దారిలో రిజిస్ట్రేషన్ ప్లాట్ లకు దారి లేకుండా దొంగ పట్టాలు సృష్టించి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒంగోలులో డబల్ రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోభూ బాధితులతో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ఉప్పుటూరు ప్రకాష్ రావు, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు దామా శ్రీనివాసులు, సిపిఎం నగర కమిటీ సభ్యులు ఎస్ డి హుస్సేన్, ధారా వెంకటేశ్వర్లు, అత్తంటి శ్రీనివాసులు, సిపిఐ నగరనాయకులు యస్ డి సర్దార్, బి సుబ్బారావు కారుమూడి నాగేశ్వరరావు, ఎద్దు రమేష్ సుబ్బారావు, గుప్తా పాప సుబ్బారావు, బి వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️