- 11 మందికి 4.17 ఎకరాలు అసైన్మెంట్ భూ పట్టాలు పంపిణీ-
- డికేటిలు ఉన్న 410 మందికి 385 ఎకరాలు సెటిల్మెంట్ పట్టాలు
- 30 మందికి రూ.27లక్షలు కళ్యాణ మస్తు/షాది తోఫా అందజేత
ప్రజాశక్తి-పిచ్చాటూరు(తిరుపతి జిల్లా): జగనన్న పాలనలో భూ సంస్కరణలు ప్రతిష్టాత్మకంగా జరుగుతోందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. మంగళవారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో పేదలకు భూ పంపిణీ, కళ్యాణ మస్తు/షాది తోఫా నగదు జమ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 మంది భూమిలేని నిరుపేదలకు 4.17 ఎకరాల అసైన్మెంట్ భూమిని పంపిణీ చేశారు. అనంతరం డికేటి పట్టాలు కలిగిన 410 మందికి 384.74 ఎకరాల భూమి రిజిస్టర్ చేసిన సెటిల్మెంట్ పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే బంగాళ, పులి కుండ్రం గ్రామాలలో 4 స్మశానాలకు 1.5 ఎకరాల భూమిని కేటాయించారు. 17 మంది ఎస్సీ మార్టిగేజ్ డీడ్ లబ్ధిదారులకు 8.15 ఎకరాల భూమిని ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. కొత్తగా పెళ్లయిన 30 జంటలకు కళ్యాణమస్తు / షాది తోఫ పథకం ద్వారా రూ.27 లక్షల మెగా చెక్కును ఎమ్మెల్యే ఆదిమూలం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని తహశీల్దారులు త్వరిత గతిన భూమిలేని పేదలకు పట్టాలు, డికేటి భూములకు సెటిల్మెంట్ పట్టాలు పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు తాము అందిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు అర్హత కలిగిన అక్రిడెట్ జర్నలిస్టులకు 3 సెంట్లు ఇంటి పట్టాలు మంజూరును వేగవంతం చేయాలని సూచించారు. భూ పంపిణీలో ఎక్కడా లంచాలకు తావు లేకుండా అధికారులు పారదర్శకతను పాటించాలని, అర్హులైన లబ్ది దారులకు మాత్రమే భూమి అందేలా చూడాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి, భూ సంస్కరణలు చేస్తున్న సీఎం జగనన్నను ప్రతి పక్ష టిడిపి, జనసేన నేతలు సైకో అనడం పై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తహశీల్దార్ మధుసూదన్ రావు, ఎంపిడివో శ్రీనివాసుల, పార్టీ అధ్యక్షుడు కే చలపతి రాజు ,రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రమేష్ రాజు ,సుబ్రమణ్యం రెడ్డి, తొపాయ్య,పాల పద్మనాభం, మోహన్, బాబు రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.