రైల్వేస్టేషన్‌ అభివద్ధి పనులు వేగవంతంబోర్డు సభ్యులు షామీర్‌ బాషా

రైల్వేస్టేషన్‌ అభివద్ధి పనులు వేగవంతంబోర్డు సభ్యులు షామీర్‌ బాషాప్రజాశక్తి – కడప అర్బన్‌ కడప రైల్వే స్టేషన్‌ అభివద్ది పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయని రైల్వే బోర్డు సభ్యులు, పులివెందుల వైసిపి మైనారిటీ నాయకులు షామీర్‌ బాషా చెప్పారు. సోమవారం రైల్వే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సుమారు రూ.45 కోట్లతో కడప రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అమత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌ కింద చేపడుతున్నట్లు చెప్పారు. స్టేషన్లలో నిర్వహిస్తున్న అభివద్ది పనులను కడప రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. ఒకటో ప్లాట్‌ ఫారం పైన ఎక్సలేటర్‌, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, ప్లాట్‌ ఫారం విస్తరణ చేస్తున్నామన్నారు. రెండు, మూడు ఫ్లాట్‌ ఫారాలలో విభిన్న ప్రతిభావంతులు ఎక్కి దిగడానికి వీలుగా లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టిటిల విశ్రాంతి భవనాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నట్లు వివరించారు. అమత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌లో భాగంగా త్వరలో ఒకటో ఫ్లాట్‌ ఫారం, టికెట్‌ కౌంటర్‌, ఇతర విభాగాలను కాస్త ముందుకు తీసుకెళ్లి విస్తరిస్తున్నారమని తెలిపారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రత్యేక దష్టి పెట్టి అమత్‌ భారత్‌ స్కీమ్‌ క్రింద కడప స్టేషన్‌ అభివద్ధికి నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు. రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్ధన్‌ అభివద్ది పనులను పరిశీలించారు.

➡️