ప్రజాశక్తి చింతాకొమ్మదిన్నె
‘ఆత్మ’ సహకారంతో చిరుధాన్యాల విలువ జోడింపుపై నైపుణ్య శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఏరువాక కేంద్రం, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ రామలక్ష్మి దేవి, ఆత్మ డిపిడి పద్మలత ఆధ్వర్యంలో సోమవారం యువ రైతులు, మహిళా రైతులు,అభ్యుదయ రైతులు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. మండలంలోని తాడిగొట్లలో అవని ఆర్గానిక్స్‌ను సందర్శించారు. సంస్థ యజమాని సునీల్ కుమార్ మాట్లాడుతూ చిరుధాన్య ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. తమ సంస్థ నుంచి తయాయ్యేచ ఉత్పత్తులు బెంగళూరు, చెన్నై, పూణస్త్ర వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుం టామని చెప్పారు. చిరుధాన్యాలను శుద్ధి చేసి, పొట్టు తీసే విధానాలు, వాటికి అవసరమయ్యే యంత్ర పరికరాలు, తయారీకి అయ్యే ఖర్చు వివరాలు వివరిం చారు. త్వరలో కొత్త యంత్రాలతో భారీగా కొప్పర్తి వద్ద మరో యూనిట్‌ను ప్రార ంభించబోతున్నామన్నారు. తర్వాత చిరుధాన్య ఉత్పత్తులతో కడప రైతు బజారులో ఔట్ లెట్ యూనిట్ నడుపుతున్న రంగారెడ్డి మాట్లాడుతూ కడప పట్టణంలోని ప్రకాశ్ నగర్ లో చిరుధాన్య ఉత్పత్తులు తయారు చేసి నెల్లూరు, కర్నూలు, అనంతపురంలోని షాపులకు ఆర్డర్ల పైన ఉత్పత్తులు పంపుతున్నామని తెలిపారు.