ప్రజాశక్తి – కడప జగనన్న గహాలను శరవేగంగా పూర్తిచేయాలని, ప్రజలకు నిర్దేశిత గడువు లోపు అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరూ.. నిబద్ధతతో పని చేయాలని కలెక్టర్ వి. విజరు రామ రాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవన్ నుంచి జాయింట్ కలెక్టర్ జి.గణేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ భరద్వాజ్, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యూష, డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్, హౌసింగ్ పీడీ కృష్ణయ్యతో కలిసి ఓటర్ల సవరణ జాబిత, జగనన్న హౌసింగ్ కాలనీల్లో గహ నిర్మాణ పనుల పురోగతి, ప్రయారిటీ బిల్డింగ్స్, నాడు-నేడు పనుల పురోగతి, విద్యాదీవెన, చేయుత, అమ్మ ఒడి,నేతన్న నేస్తం, కాపు నేస్తం, వాహన మిత్ర తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా జిల్లాలో ఫారమ్ – 6 ఫారమ్-7, ఫారమ్-8 పెండిన్సిలు, అన్ ప్రాసెస్డ్ అప్లికేషన్లను ఎప్పటికప్పుడూ పూర్తి చేసి అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు వచ్చి 30 రోజులు దాటినా అప్లికేషన్లపై ప్రత్యేక దష్టి సారించి త్వరగా పూర్తి చేయాలన్నారు. బిఎల్‌ఒలతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఇఆర్‌ఒలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిర్మిస్తున్న సచివాలయ భవనాల నిర్మాణాల విషయంలో కుడా అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గహనిర్మాణ లక్ష్యాన్ని త్వరితగతిన నిర్ణిత గడువులోగా సాదించాలని అన్నారు. గహ నిర్మాణ పనుల్లో అధికారులు చిత్త శుద్దితో పనిచేసి నిర్దేశించిన, ఆశించిన పురోగతిని చూపాలని అన్నారు. కార్యక్రమంలో కడప,బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు ఆర్‌డిఒలు మధుసూదన్, వెంకట రమణ, వెంకటేష్, శ్రీని వాసులు, వివిధ శాఖల అధికారులైన నియోజకవర్గ, మండల ప్రత్యేకధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎంఎస్‌ఒలు, సంబధిత శాఖల అధికారులు హాజరయ్యారు.