ముత్తుముల సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న వాలంటీర్లు
ప్రజాశక్తి – గిద్దలూరు : జగన్ ప్రభుత్వ వేదింపులు తాళలేక తాము తాము టీడీపీ కండువాకప్పుకున్నామని మండలంలోని సంజీవరావు పేటకు చెందిన వాలంటీర్లు తెలిపారు. పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం సంజీవరావు పేటకు చెందిన ఐదు మంది వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసి నియోజకవర్గ ఇంచార్జి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మండలంలోని సంజీవరావు పేట చెందిన వాలంటీర్లు మైల వెంకటేశ్వర్లు, కొమ్మునూరి సుమతి, కొదమల రాధిక, వలపపూరి ఉదయ్, సారమేకల లీలావతి లు వైసీపీ ప్రభుత్వం తమ విధుల నిర్వహణలో వేధింపులకు గురి చేస్తుందని జగన్ ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఖండిస్తూ మంగళవారం రోజు మూకుమ్మడిగా రాజీనామా చేసి మండల ఎంపీడీఓకు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. అనంతరం బుధవారం జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి వారికీ కండువా కప్పి సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపిలో చేరిన వాలంటీర్లు మాట్లాడుతూ గత ఎన్నికల్లో జగన్ రెడ్డి అబద్దపు హామీలను నమ్మి మోసపోయామని, నాలుగున్నర ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను వేధింపులకు, ఒత్తిడికి గురి చేస్తుందని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కడియం శేషగిరి, వలపపూరి ప్రసాద్, కంచర్ల కిరణ్ గౌడ్ తదితరులు పాల్గోన్నారు.