అసైన్డ్‌ భూములను పరిశీలించిన జెసి

Nov 21,2023 22:42

 

ప్రజాశక్తి – పిచ్చాటూరు: సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విజ్ఞప్తి మేరకు జాయింట్‌ కలెక్టర్‌ బాలాజీ , ఆర్డిఓ రవి పిచ్చాటూరు మండలంలోని ఎస్‌ ఎస్‌ బి పేట, వేలూరు గ్రామాలలో అసైన్డ్‌ భూములను మంగళవారం పరిశీలించారు, అసైన్డ్‌ భూములను పేద ప్రజలకు అర్హులైన వారికి ఇంటి పట్టా కింద , వ్యవసాయ భూములకు పంచాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. ఈ మేరకు వేలూరు గ్రామ రెవెన్యూ లెక్క దాఖాలలో సర్వే నెంబర్‌ 311,312 ఉన్న పశువుల మేత బీడు భూములను 21 మంది కుటుంబాలకు వ్యవసాయానికి పంపిణీ చేసేందుకు జాయింట్‌ కలెక్టర్‌ బాలాజీ పరిశీలించి ఈ భూములను ఆర్డిఓ ద్వారా కలెక్టర్‌ కి నివేదిక అందించి నిరుపేదలకు ఎమ్మెల్యే ద్వారా పంపిణీ అయ్యేలా చూస్తామన్నారు. ఎస్‌ఎస్‌బి పేట రెవెన్యూలో ఉన్న అసైన్డ్‌ భూములను కోర్టులో వుందని అవి క్లియర్‌ అయిన తర్వాత ఎమ్మెల్యే ద్వారా 650 మందికి ఇంటి పట్టాలకు, 400 మందికి వ్యవసాయ భూములకు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదవారికి ఎప్పుడూ అండగా ఉంటుందని పేదలకు అసైన్డ్‌ భూములు పంపిణీ చేసే విధంగా అధికారులతో చర్చించి పట్టాలు మంజూరు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు మండల తహశీల్దార్‌ మధుసూదన్‌ రావు, వేలూరు గ్రామ సర్పంచ్‌ సెల్వి శేఖర్‌, ఎస్‌ ఎస్‌ బి పేట గ్రామ సర్పంచ్‌ మనోహర్‌, వైసిపి మండల అధ్యక్షులు కే వి చలపతి రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ నాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రమేష్‌ రాజు, మోహన్‌, పద్మనాభ, వి ఏసుదాసు, రిటైర్డ్‌ ఎస్సై చంద్రన్‌, ఎస్సై వెంకటేశ్వర్లు, డిటి, ఆర్‌ఐ, వీఆర్వోలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

➡️