దారపనేనిని పరామర్శించిన జంకె, బన్నీ

Nov 24,2023 17:07 #prakasam

ప్రజాశక్తి-కనిగిరి : కనిగిరి మాజీ ఏఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ను శుక్రవారం పామూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, ప్రకాశం జిల్లా కో-ఆపరేటివ్ సహకార బ్యాంకు చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి(బన్నీ) పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై మెరుగైన వైద్యం చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యముతో స్వగ్రామానికి తిరిగి వచ్చిన సందర్భంగా సమాచారం తెలుసుకున్న జంకే వెంకట్ రెడ్డి, బన్నీ దారపనేనిని పరామర్శించారు. మా మిత్రులు మా సన్నిహితులు అయినటువంటి దారపనేని చంద్రశేఖర్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా స్వగ్రామానికి తిరిగి రావడం చాలా ఆనందదాయకమని వారు తెలిపారు.సి ఎస్ పురం మండలం అయ్యవారిపల్లె సర్పంచ్ ముత్యాల భారతి నారాయణరెడ్డి పరామర్శించిన వారిలో ఉన్నారు.

తాజా వార్తలు

➡️