ప్రజాశక్తి-హిందూపురం : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ ఇక్బాల్ కు ఆయన అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హిందూపురంలో గ్రూప్ రాజకీయాలు లేవన్నారు. డిప్యూటీ సీఎం కూడా హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి దీపికను ప్రకటించారని, పార్టీ నిర్ణయం శిరోధార్యమని తెలిపారు. సేవల ద్వారానే ప్రజలు అభిమానిస్తారని తెలిపారు. కార్యకర్తలు అందరూ కుటుంబ సభ్యులే వారిని ఆప్యాయంగా ప్రేమతో దగ్గరికి తీసుకోవాలని పేర్కొన్నారు. బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడితే ప్రతి ఒక్కరూ దూరం అవుతారని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. వైసిపి కార్యకర్తలు ఎవరు అపనమ్మకం పెట్టుకోవద్దని, ఇతరులను సంతృప్తి పరచడానికి వార్తలు రాయకూడదని ఒక పత్రికను ఉద్దేశించి అన్నారు.