ప్రజాశక్తి-పొదిలి(ప్రకాశం జిల్లా) : మండలం ఉప్పలపాడు పి.హెచ్.సి పరిధిలో హెల్త్ సూపర్ వైజర్ నారు శ్రీనివాసరెడ్డి గుండెపోటు మరణించారు. కొద్దిసేపటి క్రితం ఎయిడ్స్ ర్యాలీలో శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం అలసటగా ఉందని ప్రభుత్వ వైద్యశాలలో సేద తీరిన అనంతరం ఒక్కసారిగా సరిగా కుప్పకూలిపోయారు. ప్రాధమిక చికిత్స చేస్తున్న తరుణంలోనే మృతి చెందారు. పట్టణంలో మంచి మనిషిగా పేరొందిన శ్రీనివాసరెడ్డి మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.