ప్రజాశక్తి-విశాఖ : గురజాడ 108వ వర్ధంతి సందర్భంగా మోసయ్యపేట, అచ్చుతాపురం హైస్కూల్లో గురజాడ చిత్రపటానికి పూలమాలవేసి గురజాడ రచించిన దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెంచుమన్నా…
వట్టి మాటలు కట్టి పెట్టొయ్ గట్టిమేలు తలపెట్టవోయ్.. దేశభక్తి గీతాన్ని మహిళలు, విద్యార్థుల ద్వారా పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయురాలు రామలక్ష్మి, ఐద్వా మండల కార్యదర్శి ఆర్.లక్ష్మి, సత్యవతి, వనజ మానస మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
