ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : భీమవరపుకోట గ్రామంలో మంగళవారం స్థానిక సర్పంచ్ జగటాల వీరబాబు, ఎంపిటిసి సభ్యులు కొత్తపల్లి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో విజన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి పలు గ్రామాల నుండి వచ్చిన 75 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వీరిలో 25 మందికి కంటి ఆపరేషన్ అవసరమని వైద్యులు ధనుంజరు ఉమామహేశ్వరి, మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గంట అప్పారావు, సిరపరశెట్టి రమణ, దండా కొండబాబు అల్లంపెళ్లి ఆనందరావు, సిమ్మనపూడి నాగేశ్వరరావు, మేడప రెడ్డి నాయుడు, నడిగట్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.