ప్రజాశక్తి – పెద్దాపురం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు అన్నారు.పెద్దాపురం మండలం రాయిభూపాలపట్నంలో శుక్రవారం ఆయన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి, సిమెంట్ డ్రైన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రాజబ్బాయి, పిఎసిఎస్ చైర్మన్ నల్లల నాగేంద్రబాబు, జడ్పిటిసి గవరసాన సూరిబాబు, ఎంపీపీ పెంకే సత్యవతి, సర్పంచ్ చీకట్ల లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, పుట్టా వెంకటరావు, చీకట్ల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.