ప్రజాశక్తి-రాజానగరంఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో సొసైటీ ఫర్ కమ్యూనిటీ రీసెర్చ్ అండ్ యాక్షన్, విశ్వవిద్యాలయ స్పహ సైకాలజీ అలుమ్ని అసోసియేషన్, సైకాలజీ విభాగం, రోటరీ, జిఎస్‌ఎల్ సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల ‘సంపూర్ణత ద్వారా శ్రేష్టత’పై అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమయ్యింది. నన్నయ విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.విజయనిర్మల అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సెమినార్‌లో ముఖ్యఅతిథిగా స్పోర్ట్స్ సైకాలజిస్ట్, పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ కీలకోపన్యాసం చేశారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ డాక్టర్ చెన్నంశెట్టి విజయకుమార్ ‘నిద్ర సమస్యలు ఆరోగ్యం’ అనే అంశంపై ఉపన్యసించారు. విశ్వవిద్యాలయ విసి కె.పద్మరాజు మాట్లాడుతూ నిత్యజీవితంలో సైకాలజీ చాలా కీలకమైన అంశమన్నారు. అందరూ దాన్ని అధ్యయనం చేస్తూ మానసిక ప్రశాంతత వైపుకు వెళ్లాలని అన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 235 మంది డెలిగేట్స్ వివిధ సంస్థలు, కళాశాలల నుంచి పాల్గొన్నారు. సదస్సు డైరెక్టర్ ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కర్రి రామారెడ్డి, సదస్సు నిర్వహణకార్యదర్శి, సుంకర నాగేంద్ర కిషోర్, గూడూరు రాధిక, రాజేష్ ఖన్నా, బాడిస శ్రీనివాస్, చండీప్రియ, సైకాలజీ విభాగం కోర్సు కో ఆర్డినేటర్ డాక్టర్ నారాయణ నక్కిన, అధ్యాపకులు డాక్టర్ రాజశేఖర్ పడాల, డాక్టర్ కృష్ణ భవాని పరిశోధక సైకాలజీ విద్యార్థులు పాల్గొన్నారు.