ప్రజాశక్తి- గోకవరం
జగనన్న కాలనీలో రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని లేకుంటే తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని జనసేన జగ్గంపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. బుధవారం మండలంలోని గుమ్మళ్లదొడ్డిలో ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కి దారేది’ కార్యాక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వెదురుపాక, బావాజీపేట, గుమ్మళ్లదొడ్డి గ్రామస్తులు 300 మందికి జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. కాని కాలనీలో కనీస వసతులు లేవన్నారు. నాలుగేళ్లయినా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని తెలిపారు. ఈ సందర్భంగా సంఘటన స్థలానికి వచ్చిన గోకవరం తహశీల్దార్ శ్రీనివాస్‌కి కాలనీలో సమస్యలను ఆయన వివరించారు. ఈ సమస్యలపై కలెక్టర్‌కి లేఖ ద్వారా తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, జన సైనికులు పాల్గొన్నారు.
తహశీల్దార్‌కు సమస్యలను వివరిస్తున్న సూర్యచంద్ర