ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ):రామచంద్రపురం మండలంలోని వెంకటాయపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 42 మంది విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ ఆదివారం పంపిణీ చేశారు. సుమారు 15000 విలువైన మెటీరియల్ను గ్రామ సర్పంచ్ యల్లమిల్లి సతీష్ కుమారీ రవికుమార్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థులంతా పదిలో ఉత్తమ ర్యాంకులు సాధించాలని, పదిలో సాధించిన మార్కులాధారంగా విద్యార్థులు భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని వివరించారు. గత సంవత్సరం కూడా స్టడీ మెటీరియల్ ఇచ్చి వెంకటాయపాలెం హై స్కూల్ మండలంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్స్ అన్నిటిలో ఫస్ట్ రావడానికి దోహద పడిందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామకృష్ణ , తిలక్ , ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.