అలరించిన కళాకారుల నృత్యాలు.
ప్రజాశక్తి – తాళ్లరేవు: తాళ్లరేవులో జరిగిన ఒక వివాహ వేడుక లో విచిత్ర వేషధారణలు, కళాకారుల నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా తాళ్లరేవు మెయిన్ రోడ్డుపై రాజుల కాలం నాటి గొడుగులు, పట్టుకుని గుర్రాలపై బటులు ఊరేగగా నూతన దంపతులు వెనక రథంపై ఊరేగారు. ఈ ఊరేగింపు పలువురిని ఆకట్టుకుంది. ఊరేగింపుకు ముందుగా యువతీ ,యువకులు సినీ గీతాలకు మెయిన్ రోడ్డు పై డాన్స్ చేయడంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. మందరపు వారి వివాహ వేడుక లో భాగంగా లక్ష్మీ లోకేష్, పూజా హారిక దంపతులు రిసెప్షన్లో భాగంగా విందు భోజనంలోనూ 32 రకాల వంటకాలతో భోజన ప్రియులకు రుచికరమైన వంటలు వడ్డించడం విశేషం. ఆ ప్రాంతంలో ఎటువంటి ఆధారం లేకుండా ముగ్గురు వ్యక్తులు ఒకరి చేతి పై ఒకరు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.