ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరంలో మానవీయ వృద్ధుల అనాధ ఆశ్రమం నందు ఆశ్రయం పొందుతున్న రామకృష్ణ అనే వృద్దుడు మరణించడంతో చేయూత సంస్థ ఆధ్వర్యంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించామని అధ్యక్షుడు డాక్టర్ యం. రవికుమార్, సెక్రటరీ అలీం తెలిపారు. వారు మాట్లాడుతూ అనాధగా గత కొన్ని సంవత్సరాలుగా మానవీయ వృద్దాశ్రమం నందు ఆశ్రయం పొందుతున్న రామకృష్ణ వృద్ధాప్యం కారణం గా మృతి చెందారని సోమవారం ఆయనకి అన్ని తామై అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్ధికంగా సహకారం అందించి తమతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.