రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి

Nov 26,2023 15:39 #West Godavari District

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమ-గోదావరి) : అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరపైన ఉందని అత్తిలి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ మమ్మీ శ్రీరామ హనుమ శర్మ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన రాజ్యాంగ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శర్మ మాట్లాడుతూ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరు కాపాడుకొని దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. విద్యార్థులతో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు పి.రంగారావు, పిప్పర పంచాయతీ కార్యదర్శి జి.బాలకృష్ణ, ప్రముఖ లాయరు గుడ్ల వెంకటకృష్ణ రావు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️