ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : మండలంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు జొన్నలగరువు గ్రామంలో ఏపీ మాల మహానాడు, గ్రామస్తులు ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం నిర్వహించారు. అలాగే మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు ఆనాల సుదర్శన్ ఆధ్వర్యంలో వాకతిప్ప గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ మాల మహానాడు అధ్యక్షులు గుబ్బల రాజు,జిల్లా అధ్యక్షులు దారా వెంకట్రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదించిన దినము ఈ దేశం మొత్తం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ శ్రమను గుర్తించే రోజు అని ఈరోజు అనేక మతాలు అనేక కులాలు కలిగిన ఈ భారత దేశంలో ఐక్యమత్యంగా ఉంటూ భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉందని ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలని రాజ్యాంగం పూర్తిగా అమలు అయ్యే విధంగా కృషి చేయాలని అన్నారు. ఉప్పాడ కొత్తపల్లి ఏపీ మాల మహానాడు నాయకులు ములగపాటు బుచ్చిరాజు మాట్లాడుతూ నేటి కేంద్ర ప్రభుత్వము భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా లేదని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలను విభజన చేయడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉండటం జరుగుతుందని అన్నారు. మరొకసారి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగపు హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు సైనికులై పోరాటం చేయాలని పిలుపునివ్వడం జరిగింది అని తెలిపారు. ఎండపల్లి ఎంపీటీసీ బర్రె రవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ భారత రాజ్యాంగంలోని పొందుపరిచిన హక్కులను విధులను పాటించాలని అందరూ సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరడం జరిగింది ఈ వేరు వేరు కార్యక్రమంలో సంఘం కన్వీనర్ దడాల సత్తిబాబు, ఏపీ మాల మహానాడు కార్యవర్గ సభ్యులు మంజువరపు కృపానందం, బందిలి సూరిబాబు, బర్రె రాజు, కొంగు లోవరాజు, కాశిబాబు, చంటిబాబు, కడిమి లోవరాజు, కొల్ల చిన్నబాబు, గొడుగు వినోద్ దడాల పాల్ రాజ్, సర్పంచ్ పాలని దొరబాబు, దాకే రాజ్ కుమార్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.