రీసర్వే ను పకడ్బందీగా నిర్వహించండి

Nov 19,2023 01:16

 

సత్తెనపల్లి రూరల్‌: భూములు రీసర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.సత్తెనపల్లి తహ శీల్దార్‌ కార్యా లయంలో భూములు రీసర్వే పురోగతిని జాయింట్‌ కలెక్టర్‌ శనివారం సమీక్షించారు. సత్తెనపల్లి మండలంలొ గ్రామాల్లో జరగుచున్న భూములు రీ-సర్వే ఏ విధంగా చేస్తున్నారో, సర్వే రికార్డులను పరి శీలించారు అనంతరం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం లో జీరో డోర్‌ నంబర్‌ ల క్లెయిమ్స్‌, 10 కన్నా ఎక్కువ ఒటర్లు గల డోర్‌ నంబర్లపై, పెండింగ్‌ క్లెయిమ్స్‌, ఒటర్ల జాబితా ప్యూరిపికేషన్‌, అంశాల పై ఎన్నికల సిబ్బంది తో సమా వేశం నిర్వహించారు. ఆర్డీఓ రాజకుమారి తహసిల్దార్‌ సురేష్‌ పాల్గొన్నారు.

➡️