ప్రజాశక్తి-కోట : కోట మండలంలోని గూడలి స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఇసుక పూడికను తిరుపతి జిల్లా వైసీపీ యువజన ప్రధాన కార్యదర్శి నేదురుమల్లి.హరీష్ చంద్రా రెడ్డి ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో తొలిగించడంతో పైనుండి ప్రవహిస్తున్న నీరు మొత్తం వాకాడు దిగువ బాగానికే కాకుండా పెన్నక్క చెరువుకు ప్రవహించే విధంగా జేసీబీతో మరమ్మత్తులు చేసి ముందుస్తుగా అప్రమత్తం చేయడం జరిగింది. అనంతరం నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పంటలు పుష్కలంగా పండించుకోవడానికి వర్షాలు కోసం రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదని వర్షపునీటిని వృధా కాకుండా జాగ్రత్తగా పెన్నక్క చెరువుకు పంపే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రైతులందరూ భయబ్రాంతులకు గురి కాకుండా వరినాట్లు కొనసాగించుకోవచ్చునని అన్నారు. గతంలో కూడా రైతులు కోసం మరెన్నో ఉపయోగకర పనులు చేశానని గుర్తు చేశారు.