గుంటూరు జిల్లా ప్రతినిధి: ట్రేడ్ మార్కులు, బ్రాండెడ్ పేరుతో కొంత మంది అసలుకు దీటుగా నకిలీ వస్తువులను మార్కెట్‌లోకి తీసుకువచ్చి మోసాలకు పాల్పడుతున్నారని చాంబర్ ఆఫ్ కామర్సు అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. స్థానిక జిన్నాటవర్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో వ్యాపార వర్గాలకు ఆదివారం అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. వ్యాపారులు అంతా ట్రేడ్ మార్కు లైసెన్సులు తీసుకుంటే మోసాలను కొంత వరకు అరికట్ట వచ్చునని తెలిపారు. వోక్సో ఫాంటమ్ ఐటీ సొల్యూ షన్స్ నిర్వాహకులు మామిళ్లపల్లి సుధీర్ మాట్లాడుతూ నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని ఇందుకోసం ట్రేడ్ మార్కు లైసెన్సులు ఇస్తామని చెప్పారు.