ప్రజాశక్తి-ఉదయగిరి:రెండు రోజులు పాటు జరిగిన కులగుణన శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి. బుధవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లకి కులగుణ న శిక్షణ తరగతులతో చేపట్టిన సర్వేపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఈశ్వరమ్మ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబం పూర్తి వివరాలు తెలుసుకుని ఈ యాప్ లో పొందుపరచాలన్నారు. కార్యక్రమం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 3 వరకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలన్నారు. ఈ ఓటింగ్ ఎక్కువ శాతం బయోమెట్రిక్ ద్వారానే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎవరు స్క్రీన్ షాట్ గాని వీడియోస్ గాని తీయకూడదన్నారు. ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలు తంబు వేయాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.